kasinath: కన్నడ సినీ నటుడు, దర్శకుడు కాశీనాథ్ మృతి

  • కాశీనాథ్ (67) గుండెపోటుతో మృతి
  • బెంగళూరులోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన నటుడు 
  • సంతాపం తెలిపిన దక్షిణాది చిత్రపరిశ్రమ

ప్రముఖ కన్నడ సినీ నటుడు, దర్శకుడు కాశీనాథ్ (67) గుండెపోటుతో మృతి చెందారు. బెంగళూరులో శ్రీ శంకర ఆసుపత్రిలో ఈరోజు ఉదయం కాశీనాథ్ మృతి చెందినట్టు ఆయన కుటుంబసభ్యులు తెలియజేశారు. రెండు రోజుల పాటు వైద్యుల సంరక్షణలో ఉన్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. కాశీనాథ్ మృతిపై దక్షిణాది చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది. కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ తన ‘ఫేస్ బుక్’ లో సంతాపం తెలిపారు.

కాగా, 1976లో దర్శకుడిగా కన్నడ సినీ పరిశ్రమలోకి ఆయన అడుగుపెట్టారు. 1978లో ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘అపరిచిత’ సినిమా తెలుగులోకి డబ్ చేయబడింది. 1980లలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన అందించారు. కాశీనాథ్ నటించిన చివరి కన్నడ సినిమా ‘చౌకా’ 2017లో విడుదలైంది. హాస్య ప్రధాన పాత్రల్లో  నటించిన ఆయన కన్నడతో పాటు తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో తెరకెక్కించిన చిత్రాలతో విశ్వనాథ్ ఫేమస్ అయ్యారు. ‘అనుభవం’, ‘వింత శోభనం’, ‘పొగరుబోతు పెళ్లాం’, ‘సుందరాంగుడు’, ‘భూలోకంలో రంభ ఊర్వశి మేనక’ వంటి శృంగారభరిత చిత్రాల్లో విశ్వనాథ్ నటించారు.

More Telugu News