duck walk: గ్రౌండ్‌లో విద్యార్థితో డక్ వాక్ చేయించిన టీచర్లు.. బాలుడి మృతి.. సీసీ కెమెరాలో రికార్డు

  • చెన్నైలోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో ఘటన
  • స్కూల్‌కి ఆలస్యంగా వచ్చినందుకు శిక్ష
  • విద్యార్థి తల్లిదండ్రుల, బంధువుల ఆందోళన
  • దర్యాప్తు జరుపుతోన్న పోలీసులు

ఆలస్యంగా వచ్చినందుకు గానూ కొందరు విద్యార్థులను టీచర్లు డక్ వాక్ చేయమన్నారు. ఈ క్రమంలో మోకాళ్లపై నడుస్తూ, అలసిపోయిన ఓ విద్యార్థి కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన చెన్నైలోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో చోటు చేసుకుంది. దీంతో ఆ బాలుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై ఆ బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్కూల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.    

More Telugu News