padmavat: పద్మావత్ సినిమాపై ఆందోళన.. థియేటర్ల వద్ద విధ్వంసం ప్రారంభం

  • విడుద‌ల‌కు సిద్ధ‌మైన బాలీవుడ్ సినిమా 'పద్మావత్‌'
  • తీవ్ర పరిణామాలుంటాయని ఇప్పటికే హెచ్చరించిన రాజ్‌పుత్‌లు 
  • 'పద్మావత్‌' విడుదల కానున్న థియేటర్ ముందు ఆందోళన
  • బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఘటన

విడుద‌ల‌కు సిద్ధ‌మైన బాలీవుడ్ సినిమా 'పద్మావత్‌'పై రాజ్‌పుత్ సంఘాలు మ‌ళ్లీ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా విడుద‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన‌ప్ప‌టికీ.. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాను విడుదల చేయ‌కూడ‌ద‌ని రాజ్‌పుత్‌లు హెచ్చరిస్తున్నారు.

 ఆ సినిమాను విడుదల చేస్తే థియేటర్లను తగులబెడతామని హెచ్చరించిన ఆందోళనకారులు తాజాగా బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఓ థియేటర్ వద్ద రచ్చ రచ్చ చేశారు. ఈ నెల 25 నుంచి ఆ సినిమాను ఈ థియేటర్‌లో ప్రదర్శిస్తోన్న నేపథ్యంలో ఆందోళనకారులు అక్కడి పోస్టర్లను చించేస్తూ, పలు కటౌట్‌లను ధ్వంసం చేశారు.      

More Telugu News