sachin: నిమ్మ‌కాయ‌లు కోస్తున్న స‌చిన్... వీడియో చూడండి!

  • స‌చిన్ కోస్తుంటే స్నేహితుడి కామెంట‌రీ
  • పొర‌పాటున నిమ్మ‌కాయ‌ను మామిడికాయ అన్న స్నేహితుడు
  • వైర‌ల్ అవుతున్న వీడియో

స్నేహితుల‌తో క‌లిసి తన ఫార్మ్‌హౌస్‌లో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ నిమ్మ‌కాయలు కోస్తున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఓ పెద్ద క‌ర్ర ప‌ట్టుకుని చెట్టు నుంచి నిమ్మ‌కాయ‌ను తెంపిన సంద‌ర్భాన్ని అత‌ని స్నేహితుడు వీడియో తీశాడు. స‌చిన్ కోస్తుంటే ఆ స్నేహితుడు కామెంట‌రీ కూడా ఇచ్చాడు. అయితే పొర‌పాటున స‌చిన్ కోసిన నిమ్మ‌కాయ‌ను మామిడికాయ అన్నాడు. దీంతో స‌చిన్ వెంట‌నే అత‌ని త‌ప్పును స‌రిచేస్తుండ‌టం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను సచిన్‌ తన ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకున్నాడు.

More Telugu News