facebook: ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచ‌ర్‌.. గ్రూప్ స‌భ్యులంతా ఒకేసారి వీడియో చూసే అవ‌కాశం

  • వీడియో చూస్తూ చ‌ర్చించుకునే స‌దుపాయం
  • లైవ్ వీడియోకు వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి ఈ ఫీచ‌ర్ అభివృద్ధి
  • స‌భ్యుల మధ్య అనుసంధానం మ‌రింత పెంచే యోచ‌న‌

ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో ఫీచ‌ర్ అంద‌రికీ తెలిసిందే. ఓ ప‌క్క లైవ్ కొన‌సాగుతుండ‌గా, ఆ వీడియో గురించి కామెంట్ సెక్ష‌న్‌లో లోతైన చ‌ర్చ చేసుకునే అవ‌కాశం క‌లుగుతుంది. కానీ ఇంత‌కుముందే పోస్ట్ చేసిన వీడియో గురించి చ‌ర్చించుకునే అవ‌కాశం ఫేస్‌బుక్‌లో లేదు. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు ఫేస్‌బుక్ ఓ కొత్త ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. దీని పేరు 'వాచ్ పార్టీ'

ఈ ఫీచ‌ర్ ద్వారా ఏదైనా ఒక వీడియోను గ్రూప్ స‌భ్యులంతా ఒకేసారి చూస్తూ, దాని గురించి చ‌ర్చించుకునే అవ‌కాశం క‌లుగుతుంది. లైవ్ వీడియోల‌కు వ‌స్తున్న ఆద‌రణ చూసి ఫేస్‌బుక్ ఈ ఫీచ‌ర్‌ను అభివృద్ధి చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఫీచ‌ర్ ద్వారా గ్రూప్ స‌భ్యుల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర చ‌ర్చ‌లు వ‌చ్చి, అనుసంధానం మ‌రింత పెరుగుతుంద‌ని ఫేస్‌బుక్ భావిస్తోంది.

More Telugu News