kcr: దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ను గౌరవిస్తామంటే స్వాగతిస్తాం: సీఎం కేసీఆర్

  • ‘ఇండియా టుడే’ సౌత్ కాన్ క్లేవ్ - 2018లో పాల్గొన్న కేసీఆర్
  • దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ
  • తెలంగాణలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్నాం
  • వ్యవసాయంలో కూడా ఆదర్శ రాష్ట్రం కానుంది

తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందని, దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ను గౌరవిస్తామంటే స్వాగతిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ‘ఇండియా టుడే’ సౌత్ కాన్ క్లేవ్ - 2018 జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్ద్ దేశాయ్ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానమిచ్చారు.

తెలంగాణను పునర్ నిర్మిస్తూనే దేశాభివృద్ధిలో భాగమయ్యామని అన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, తెలంగాణలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్నామని, వ్యవసాయంలో కూడా తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలవబోతోందని చెప్పారు.

భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట ఆంధ్ర-తెలంగాణను నాడు విలీనం చేయడం చారిత్రక తప్పిదమని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల ప్రజల జీవనవిధానమే వేరని అన్నారు. 

More Telugu News