anushka: సెన్సార్ పూర్తి చేసుకున్న 'భాగమతి'

  • 'భాగమతి'గా రానున్న అనుష్క 
  • తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ 
  • ఈ నెల 26వ తేదీన సినిమా విడుదల

 అనుష్క అభిమానులంతా కూడా ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'భాగమతి' కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. టీజర్లో చూపించిన దృశ్యాలు .. అనుష్క రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించడం వాళ్లలో ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో టబు .. ఆది పినిశెట్టి ముఖ్యమైన పాత్రలను పోషించారు. అశోక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, తమన్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఓ 'అరుంధతి' .. ఓ 'రుద్రమదేవి' చిత్రాల సరసన ఈ సినిమా నిలుస్తుందని అనుష్క బలంగా భావిస్తోంది. 

More Telugu News