jio: జియో అభివృద్ధి కోసం 31 బిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు పెట్టిన రిల‌య‌న్స్‌

  • త్వ‌ర‌లో మ‌రో 23 బిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు పెట్టే అవ‌కాశం
  • కొత్త టెక్నాల‌జీ కోసం ఖ‌ర్చు చేయ‌నున్న సంస్థ‌
  • అంచ‌నా వేసిన మూడీస్ ఇన్వెస్ట‌ర్స్ స‌ర్వీస్‌

భార‌త స‌మాచార, సాంకేతిక రంగంలో విప్ల‌వం తీసుకువ‌చ్చిన జియో అభివృద్ధి కోసం ముకేశ్ అంబానీ పెద్ద మొత్తంలోనే ఖ‌ర్చు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు జియో అభివృద్ధి కోసం రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ 31 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా ఖ‌ర్చు పెట్టింద‌ని మూడీస్ ఇన్వెస్ట‌ర్స్ స‌ర్వీస్ వెల్ల‌డించింది. 2016లో జియో వ‌చ్చిన నాటి నుంచి, ఇవాళ నాలుగో పెద్ద టెలికాం కంపెనీగా ఎద‌గ‌డానికి మ‌ధ్య అమ‌లు చేసిన విధానాలను అధ్య‌య‌నం చేసిన మూడీస్ ఓ నివేదిక‌ను రూపొందించింది.

అంతేకాకుండా భ‌విష్య‌త్తులో జియో పేరుతో రిల‌య‌న్స్ సంస్థ పెట్ట‌నున్న పెట్టుబ‌డుల గురించి కూడా మూడీస్ అంచ‌నా వేసింది. ఫైబ‌ర్ టు హోమ్‌, డిజిట‌ల్ టీవీల‌తో పాటు జియో స‌ర్వీసులను కూడా రిల‌య‌న్స్ సంస్థ భవిష్య‌త్తులో అభివృద్ధి చేయ‌బోతోంద‌ని మూడీస్ పేర్కొంది. 4జీ ఫోన్ల త‌యారీ, నెట్‌వ‌ర్క్‌లో నాణ్య‌త‌ల‌ను కూడా జియో అందించ‌నుంది.

More Telugu News