charan: చరణ్ - బోయపాటి మూవీ షూటింగ్ రేపటి నుంచే

  • చరణ్ హీరోగా బోయపాటి నెక్స్ట్ మూవీ 
  • రేపటి నుంచి ఫస్టు షెడ్యూల్ 
  • రెండవ షెడ్యూల్ నుంచి చరణ్

చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో సినిమా ఇటీవలే లాంచ్ అయింది. అప్పటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తితో అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపు ఉదయం నుంచి మొదలవుతుందని సమాచారం.

 మొదటి షెడ్యూల్ లో కొంతమంది సీనియర్ .. జూనియర్ ఆర్టిస్టులపై  సన్నివేశాలను తెరకెక్కిస్తారట. వచ్చేనెలలో జరగనున్న రెండవ షెడ్యూల్ లోనే చరణ్ జాయిన్ అవుతాడని అంటున్నారు. ఈ లోగా ఆయన 'రంగస్థలం' సినిమా షూటింగును పూర్తి చేసి .. లుక్ మార్చుకుంటాడని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికలుగా అనూ ఇమ్మాన్యుయేల్ .. కైరా అద్వాని పేర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరినీ తీసుకుంటారా? .. ఇద్దరిలో ఒకరిని మాత్రమే ఎంపిక చేసుకుంటారా? అనేది చూడాలి.    

More Telugu News