america: అమెరికాలో విదేశీ ఐటీ ఉద్యోగుల్లో 40 శాతం మంది భార‌తీయులే!

  • దిగ్గ‌జ‌ ఐటీ సంస్థ‌ల్లో మొత్తం ఉద్యోగుల్లో 70 శాతం విదేశీయులే
  • అధికంగా శాన్‌ఫ్రాన్సిస్కోలో
  • వెల్ల‌డించిన సియాటెల్ టైమ్స్ నివేదిక‌

అమెరికా ఐటీ సంస్థ‌ల్లో ప‌నిచేస్తున్న విదేశీ ఉద్యోగుల్లో 40 శాతానికి కంటే ఎక్కువ‌గా భార‌తీయులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, బోయింగ్ వంటి దిగ్గ‌జ సంస్థ‌ల్లో దాదాపు 70 శాతం మంది విదేశీ ఉద్యోగులే ఉన్నార‌ని సియోటెల్ టైమ్స్ ఓ నివేదికలో వెల్ల‌డించింది. అమెరికా వ్యాప్తంగా ఉన్న ప్ర‌ముఖ న‌గ‌రాల్లోని ఐటీ కంపెనీల్లో విదేశీ ఉద్యోగులే ఎక్కువ‌గా ఉన్నారు. వీరిలో భార‌తీయులు మొద‌టిస్థానంలో ఉండ‌గా, చైనీయులు రెండో స్థానంలో ఉన్న‌ట్లు నివేదిక పేర్కొంది.

ఈ భారతీయ ఉద్యోగులు అధికంగా శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్నార‌ని నివేదిక తెలిపింది. ఇక్క‌డ విదేశీ ఉద్యోగులు సగానికి పైగా ఉంటారని చెప్పింది. వాషింగ్టన్‌-ఆర్లింగ్టన్‌-అలెగ్జాండ్రియా ప్రాంతాల్లో 33.8 శాతం, డల్లాస్‌-ఫోర్ట్‌వర్త్‌లో 31.4 శాతం, బోస్టన్‌-కేంబ్రిడ్జ్‌లో 30.8 శాతం, శాన్‌డీగో-కార్స్ల్‌బాద్‌లో 30.5 శాతం విదేశీ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.

More Telugu News