ram: రామ్ న్యూ మూవీ పట్టాలెక్కేది అప్పటి నుంచే!

  • త్రినాథరావు దర్శకత్వంలో రామ్ 
  • ఇద్దరు కథానాయికలు 
  • మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్   

త్రినాథరావ్ దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయడానికి రామ్ రెడీ అవుతున్నాడు. కథా పరంగా ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉండనున్నారు. త్వరలోనే ఆ కథానాయికలను ఖరారు చేయనున్నారు. రామ్ కి ఇది 16వ సినిమా .. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

 ప్రేమ కథాంశం నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాను, ఫిబ్రవరి మొదటివారంలోనే మొదలుపెట్టాలనుకున్నారు .. కానీ కుదరలేదు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో వున్నారు. ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించనుండటం విశేషం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. 

ram

More Telugu News