health scheme: దేశంలో అందరికీ ఆరోగ్య బీమా పథకం... కేంద్రం మదిలో ఆలోచన!

  • బడ్జెట్ లో ప్రకటన చేసే అవకాశం
  • రూ.3-5 లక్షల వరకు బీమా కవరేజీ
  • రూ.2 లక్షల్లోపు ఆదాయ వర్గాలకు ఉచితం
  • ఓ హిందీ దినపత్రికలో కథనం

దేశ ప్రజలందరికీ ఓ సమగ్ర ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం ఆలోచిస్తోంది. రానున్న బడ్జెట్ లో ఈ మేరకు ప్రకటన కూడా చేయవచ్చంటూ ఓ హిందీ దినపత్రిక ఈ రోజు కథనాన్ని ప్రచురించింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకంగా దీన్ని ప్రకటించి రూ.5,000 కోట్లను కేటాయించనున్నట్టు ఆ కథనం పేర్కొంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిన 40 శాతం వాటాను భరించాల్సి ఉంటుంది. రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు బీమా కవరేజీ ఇచ్చే ఆలోచనతో ఉంది. ఈ పథకం నిర్వహణను చూసేందుకు ఓ ట్రస్ట్ ను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అనుకుంటున్నట్టు సమాచారం.

ఆరోగ్య బీమాను మూడు వర్గీకరణలు చేయడం ద్వారా... దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి కోసం కేంద్రమే బీమా ప్రీమియం భరిస్తుంది. దీని పేరు కల్యాణ్. అలాగే, రూ.2 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారి ప్రీమియం కూడా కేంద్రమే భరిస్తుంది. దీని పేరు సౌభాగ్య. రూ.2 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు పరిమితంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీని పేరు సర్వోదయ. ఇది ఎంత వరకూ వాస్తవమో తెలియాలంటే బడ్జెట్ వరకూ వేచి చూడాల్సిందే.

More Telugu News