sai dharam tej: కరుణాకరన్ తో సాయిధరమ్ తేజ్ .. హాలీవుడ్ మూవీ రీమేక్

  • ప్రేమకథల స్పెషలిస్ట్ కరుణాకరన్ 
  • తాజా చిత్రం సాయిధరమ్ తేజ్ తో 
  • భార్యాభర్తల బంధానికి అద్దం పట్టే కథ

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ .. వినాయక్ దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన కరుణాకరన్ కాంబినేషన్లో ఒక సినిమా చేయనున్నాడు. కరుణాకరన్ పేరు వినిపించగానే 'తొలిప్రేమ' .. 'హ్యాపీ' .. 'చిన్నదాన నీ కోసం' వంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ గుర్తుకువస్తాయి.

 అలాంటి కరుణాకరన్ .. సాయిధరమ్ తేజ్ తో ఓ ప్రేమకథాంశాన్నే తెరకెక్కించనున్నాడు. 2012లో వచ్చిన హాలీవుడ్ మూవీ 'వొవ్'కి ఇది రీమేక్ అని అంటున్నారు. భార్యాభర్తల బంధానికి .. అనుబంధానికి ఈ కథ అద్దం పట్టేలా వుంటుందట. యూత్ నే కాదు .. ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం కట్టిపడేసే కంటెంట్ ఉంటుందనీ, ఎమోషనల్ సీన్స్ ఆయువుపట్టుగా నిలుస్తాయని అంటున్నారు. త్వరలోనే ఈ  సినిమా పట్టాలెక్కనుంది.   

More Telugu News