Telugudesam: తాగుబోతు నడుపుతున్న కారులో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తనయుడి వీరంగం!

  • బుధవారం రాత్రి తాగి నడుపుతూ యాక్సిడెంట్ చేసిన యువకుడు
  • కారులోనే ఉన్న జలీల్ ఖాన్ తనయుడు సాహుల్ ఖాన్
  • పోలీసులతో వాగ్వాదానికి దిగిన సాహుల్

విజయవాడ నగర వీధుల్లో బుధవారం రాత్రి ఓ తాగుబోతు కారు నడుపుతూ హల్ చల్ చేయగా, అతని పక్కనే తెలుగుదేశం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమారుడు సాహుల్ ఖాన్ ఉండటం కలకలం రేపింది. కృష్ణ తేజ అనే యువకుడు మద్యం తాగి కారు నడుపుతూ, పాలీక్లినిక్ రోడ్డులో వేగంగా దూసుకొచ్చి, ఓ బైకును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా, అక్కడికి దగ్గర్లోనే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి, వారిని ఆసుపత్రికి తరలించారు.

ఆ సమయంలో కృష్ణతేజ మద్యం సేవించి ఉన్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా కారు చిత్రాలను పోలీసులు తమ కెమెరాల్లో బంధించబోగా, సాహుల్ ఖాన్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఫొటోలు తీయడానికి వీల్లేదని హంగామా చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More Telugu News