Balakrishna: ఇప్పటి కళాకారులను చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంటుంది!: సినీ నటుడు బాలకృష్ణ

  • వారిని చూస్తుంటే తృప్తిగా భోజనం చేస్తున్నారా? అని అనిపిస్తూ ఉంటుంది
  • శిల్పాకళావేదికలో టీఎస్ ఆర్ - కాకతీయ మహోత్సవం
  • కళా సేవలో తరిస్తున్న టి.సుబ్బరామిరెడ్డి: బాలకృష్ణ

ఇప్పటి కళాకారులను చూస్తుంటే వారు తృప్తిగా భోజనం చేస్తున్నారా? అని తనకు అనిపిస్తూ ఉంటుందని ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో 'టీఎస్ ఆర్ - కాకతీయ మహోత్సవం' ఈరోజు సాయంత్రం మొదలైంది. ఈ వేడుకలో ప్రముఖ సినీనటుడు మోహన్ బాబును విశ్వ నట సార్వభౌమ అవార్డుతో సత్కరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ మాట్లాడుతూ, కళాసేవలో తరిస్తున్న టి.సుబ్బరామిరెడ్డి లాంటి వ్యక్తి వల్ల కళాకారులు సంతోషపడుతున్నారని ప్రశంసించారు. సినీ రంగంలో మోహన్ బాబు ప్రస్థానం గురించి ఆయన ప్రస్తావించారు. 

More Telugu News