chiranjeevi: కేరళలో 'సైరా' సెకండ్ షెడ్యూల్ షూటింగ్

  • ఫస్టు షెడ్యూల్ పూర్తి చేసిన 'సైరా'
  • రెండవ షెడ్యూల్ షూటింగ్ కి సన్నాహాలు 
  • కేరళలో ముఖ్యమైన సన్నివేశాలు  

చిరంజీవి తాజా చిత్రంగా 'సైరా' తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండవ షెడ్యూల్ షూటింగ్ కి రెడీ అవుతోంది. ఫిబ్రవరి ఫస్టు వీక్ లో ఈ సినిమా రెండవ షెడ్యూల్ మొదలవుతుందని అన్నారు. కానీ ఈ విషయంలో మరింత ఆలస్యం కానున్నట్టు చెబుతున్నారు.

ఫిబ్రవరి 20వ తేదీ నుంచి రెండవ షెడ్యూల్ మొదలుకానుందని అంటున్నారు. ఆ రోజు నుంచి ఈ సినిమా షూటింగ్ 'కేరళ'లో కొనసాగనుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ లోనే నయనతార జాయిన్ కానుందని అంటున్నారు. చిరంజీవి కెరియర్లోనే చెప్పుకోదగినదిగా ఈ సినిమా నిలిచిపోతుందనేది ఆయన అభిమానుల మాట.      

More Telugu News