sensex: స‌రికొత్త రికార్డు సృష్టించిన సెన్సెక్స్‌... 35వేల మార్క్‌ని దాటిన బీఎస్ఈ

  • 35,081.82 వద్ద ముగిసిన సెన్సెక్స్‌ 
  • ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లే కార‌ణం
  • ఆద్యంతం లాభాల్లో సాగిన మార్కెట్లు

మార్కెట్ చ‌రిత్ర‌లో తొలిసారిగా బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సెన్సెక్స్ ఓ స‌రికొత్త రికార్డును నెల‌కొల్పింది. మొద‌టిసారిగా 35వేల మార్క్‌ని బీఎస్ఈ తాకింది. మంగ‌ళ‌వారం మార్కెట్‌ల ప్రారంభ స‌మ‌యం నుంచే లాభాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్‌, మ‌ధ్యాహ్న స‌మ‌యానికి ఈ రికార్డును నెల‌కొల్పింది. ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లే ఈ రికార్డును సాధించ‌డానికి కార‌ణంగా తెలుస్తోంది. 310.77 పాయింట్ల లాభంతో 35,081 వ‌ద్ద సెన్సెక్స్ ముగిసింది.

మ‌రోవైపు నిఫ్టీ కూడా 88 పాయింట్ల లాభంతో 10,788 వ‌ద్ద ముగిసింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌ తదితర షేర్లు లాభాల్లో దూసుకెళ్లాయి. ఇటీవల వెలువడిన ఐటీ కంపెనీల సానుకూల త్రైమాసిక ఫలితాలతో పాటు రేపు జరగబోయే జీఎస్‌టీ సమావేశంపై ఆశాజనకంగా ఉన్న మదుపర్లు పెట్టుబడుల బాట పట్టినట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

More Telugu News