vijay devarakonda: 'గీతా గోవిందం' సినిమాకి 10 కోట్లకి పైగానే ఖర్చు!

  • గీతా ఆర్ట్స్ బ్యానర్ పై 'గీతా గోవిందం'
  • పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ
  • విజయ్ కెరియర్లోనే భారీ బడ్జెట్  

తెలుగులోని భారీ నిర్మాణ సంస్థల్లో గీతాఆర్ట్స్ ఒకటిగా కనిపిస్తుంది.  సుదీర్ఘ కాలంగా ఈ సంస్థ భారీ చిత్రాలను .. అఖండమైన విజయాలను అందిస్తూ వస్తోంది. ఈ సంస్థలో ఒక్క సినిమా చేసినా చాలు అనుకునే నటీనటులు ఎంతోమంది వున్నారు. అలాంటి అవకాశం విజయ్ దేవరకొండకి తొందరగానే లభించింది. ప్రస్తుతం ఆయన ఈ సంస్థలో .. పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాకి 'గీతా గోవిందం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. సరికొత్త ప్రేమకథా కావ్యంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంతవరకూ విజయ్ దేవరకొండ చేస్తూ వచ్చిన సినిమాలన్నీ 3 కోట్ల లోపువే. కానీ గీతా ఆర్ట్స్ వారు మాత్రం ఈ సినిమా కోసం దాదాపు 10 కోట్లను ఖర్చు చేస్తున్నట్టుగా వినికిడి. అదే నిజమైతే విజయ్ దేవరకొండ కెరియర్లో ఇదే అత్యధిక బడ్జెట్ కలిగిన సినిమా అవుతుంది.   

More Telugu News