stephen Hawking: స్టీఫెన్ హాకింగ్ 1985లోనే చనిపోయాడా? ఇప్పుడున్నది ఆయన స్థానంలో మరొకరా?

  • హాకింగ్ మూడు దశాబ్దాల క్రితమే చనిపోయాడు
  • ప్రాణాంతకమైన ఏఎల్ఎస్ వ్యాధితో బాధపడుతున్న ఆయన బతకడం అసాధ్యం
  • ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకే ఆయన స్థానంలో మరొకరు
  • అమెరికా, బ్రిటన్ సిద్ధాంత కర్తలు చెబుతున్నది ఇదే

ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చనిపోయి చాలా ఏళ్లు అయిందా? ఆయన స్థానంలో వేరే వ్యక్తిని కూర్చోబెట్టి ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? అవుననే అంటున్నారు బ్రిటన్, అమెరికా సిద్ధాంతకర్తలు. హాకింగ్ 1985లోనే మరణించారని అంటున్నారు కొందరు సిద్ధాంత కర్తలు. ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ అనే పుస్తకాన్ని రాసిన హాకింగ్ దాని ప్రచురణకు మూడేళ్ల ముందే చనిపోయారని వాదిస్తున్నారు. హాకింగ్ స్థానంలో మరొకరిని కూర్చోబెట్టాల్సినంత అవసరం ఏముందన్న ప్రశ్నకు కూడా వారు సమాధానాలు చెబుతున్నారు. ఆయన చనిపోయాడని చెప్పేందుకు ఆరు కారణాలను చెబుతున్నారు.

హాకింగ్ 1963లో ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ (ఏఎల్ఎస్) అనే జబ్బు బారిన  పడ్డారు. ఇది ఓ భయంకరమైన నరాల క్షీణత వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు నాలుగేళ్ల కంటే ఎక్కువ కాలం బతకడం దాదాపు అసాధ్యం. మహా అయితే 1970 వరకు హాకింగ్ జీవించి ఉండాలి. కానీ వ్యాధి సోకి 55 ఏళ్లు అవుతోంది. ఈనెల 8న హాకింగ్ 77వ పుట్టిన రోజును జరుపుకున్నారు.

 తీవ్రమైన నరాల జబ్బుతో బాధపడుతున్న హాకింగ్ 30 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పటికీ ఆయన రూపం అలానే ఉంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. 1965లో జేన్ వెల్డీ అనే మహిళను హాకింగ్ పెళ్లాడారు. ఆమె వదిలేశాక తనకు నర్సుగా పనిచేసిన ఎలైన్ మేసన్‌ను పెళ్లాడారు. అయితే పెళ్లిళ్ల సందర్భంగా తీయించుకున్న రెండు ఫోటోలను పరీక్షించి చూస్తే వాటిల్లో ఉన్నది ఒక్కరు కాదని అర్థమవుతోంది.

వ్యాధికి గురై కుర్చీకి పరిమితమైన హాకింగ్ వాయిస్ సింథసైజర్‌తో మాట్లాడుతున్నారు. కేవలం కుడి దవడను మాత్రమే కదపడం ద్వారా ఆయన ఎదురుగా ఉన్న అడ్వాన్స్‌డ్ కంప్యూటర్‌  దానిని స్కాన్ చేసి శబ్ద తరంగాలుగా  మార్చి ప్రపంచానికి వినిపిస్తోంది. నిజానికి ఇది అసాధ్యం. వెనక ఎవరో రోబో వాయిస్ వినిపిస్తుండవచ్చు.  ఇలా పలు కారణాలను సిద్ధాంతకర్తలు చెబుతూ హాకింగ్ బతికి లేరని కుండ బద్దలుకొట్టి మరీ చెబుతున్నారు. అయితే ఓ సైంటిస్ట్ చనిపోతే ఆయన స్థానంలో మరో వ్యక్తిని కూర్చోబెట్టాల్సిన అవసరం ఏముంది? ఆయనేమీ ఓ దేశానికి ప్రెసిడెంటో.. రాజో కాదు కదా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.  దీనికి కూడా వారు సమాధానం చెబుతున్నారు.

 ప్రపంచంలో సైన్స్ తప్ప మరోటి లేదని చెప్పేందుకు హాకింగ్ లాంటి భౌతిక శాస్త్రవేత్త కావాలి. ప్రజలను శాస్త్రబద్ధమైన ఆలోచనల వైపు నడిపించాలంటే ఇంతకు మించిన మార్గం లేదు. ప్రపంచాన్ని దేవుడే నడిపిస్తున్నాడన్న వాదనలను కొట్టిపడేసి శాస్త్రీయ మార్గం వైపు మళ్లించాలంటే దానికి హాకింగే సరైన వ్యక్తి అన్నది వారి వాదన. అందుకే హాకింగ్ చనిపోయినా, ఆయనను వాడుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.

More Telugu News