Kathi Mahesh: ద‌ళిత సంఘాలు, బీసీ సంఘాలతో రోడ్డుపైకి వ‌స్తా.. ప‌వ‌న్ క‌ల్యాణే నా కాళ్ల వ‌ద్ద‌కు రావాల్సి ఉంటుంది: మ‌హేశ్ క‌త్తి హెచ్చరిక

  • జాగ్ర‌త్తగా ఉండండి
  • అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేయ‌కండి
  • నేను పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాలంటున్నారు
  • లేదంటే గొడవ ఆగదని అంటున్నారు

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌తో ఏర్పడిన వివాదంలో తాను ఇప్పటికే ఒక మెట్టు దిగానని, మొదట పవన్ వచ్చి తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశానని, అనంతరం ఆయన ఒక ట్వీట్ చేస్తే చాలని చెప్పానని సినీ విమర్శకుడు మహేశ్ కత్తి అన్నారు. తాను ఎన్నడూ పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా తిట్టలేదని, ఆయన అభిమానులు మాత్రం తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని అన్నారు. 'ప్రజాస్వామ్య దేశంలో నా భావాన్ని నిర్భయంగా వ్యక్తపరిచే హక్కు లేదా?' అని ప్రశ్నించారు.

ఆ హక్కును కాలరాసేలా పవన్ ఫ్యాన్స్ తనను బెదిరిస్తున్నారని మహేశ్ కత్తి చెప్పారు. తన ప్రతి కదలిక మీదే కాకుండా, తన కుటుంబ సభ్యులపైన కూడా కామెంట్లు చేస్తున్నారని అన్నారు. పైగా ఈ వివాదం ఆగాలంటే తననే ఓ మెట్టు దిగాలని నీతులు చెబుతున్నారని, ఇటువంటి అభిమానులు ఉంటే జనసేన పార్టీ నాశనం అవుతుందని అన్నారు. వివాదానికి తెరదించాలని తాను చర్చకు వస్తే తన కుటుంబ సభ్యులపై కామెంట్లు చేస్తున్నారని, పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాలని, లేదంటే గొడవ ఆగదని అంటున్నారని అన్నారు. 'ఇంతకీ వారు నన్ను బెదిరిస్తున్నారా?' అని ప్ర‌శ్నించారు.

'నేనే క‌నుక రోడ్డుపైకి వ‌చ్చి ఆందోళ‌న చేస్తే నా వైపు ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌క‌ సంఘాలు, ద‌ళిత సంఘాలు, బీసీ సంఘాలు ఉంటాయి. అప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణే నా కాళ్ల వ‌ద్ద‌కు రావాల్సి ఉంటుంది. జాగ్ర‌త్తగా ఉండండి. అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేయ‌కండి' అంటూ మ‌హేశ్ క‌త్తి తీవ్రంగా హెచ్చ‌రించారు.

More Telugu News