muslims: హజ్‌ యాత్రికులకు సబ్సిడీ ఎత్తివేతపై మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ!

  • హజ్‌ యాత్రకు మాత్రమే ఎందుకు?
  • అన్ని మతాల యాత్రలకు సంబంధించి సబ్సిడీలను రద్దు చేయాలి
  • ముస్లింలను ల‌క్ష్యంగా చేసుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు
  • ముస్లింల అభివృద్ధికి రూ.2 వేల కోట్లు కేటాయించాలి

సౌదీలోని మక్కా, మదీనా నగరాల్లో జరిగే పవిత్ర హజ్‌యాత్రకు వెళ్లే భారత ముస్లిం యాత్రికులకు ఇచ్చే సబ్సిడీని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఈ నిర్ణ‌యంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిప‌డ్డారు. హజ్‌ యాత్రకు మాత్రమే కాకుండా అన్ని మతాల యాత్రలకు సంబంధించి సబ్సిడీలను రద్దు చేయాలని, కేవలం ముస్లింలను ల‌క్ష్యంగా చేసుకొని ప్ర‌భుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంద‌ని విమర్శించారు. అలాగే ఈ సారి బడ్జెట్‌లో ముస్లింల అభివృద్ధికి రూ.2 వేల కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News