pavan: పవన్ కల్యాణ్ తదుపరి చిత్రంగా 'చరిత్ర'?

  • పవన్ తదుపరి సినిమాపై ఫ్యాన్స్ ఆసక్తి
  • ఎ.ఎమ్. రత్నం నిర్మాణంలో ఓ మూవీ 
  • మైత్రీ బ్యానర్లో మరో మూవీ  

త్రివిక్రమ్ .. పవన్ కాంబినేషన్లో వచ్చిన 'అజ్ఞాతవాసి' అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. అయినా ఆయా ప్రాంతాల్లో ఈ సినిమా వసూళ్లు బాగానే వున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా తరువాత పవన్ ఏ ప్రాజెక్టు చేయనున్నాడనే ఆసక్తి అందరిలో పెరిగిపోతోంది.

 ఆయన నెక్స్ట్ మూవీ ఎ.ఎమ్. రత్నంతో వుండనుందనీ, ఈ సినిమాకి 'చరిత్ర' అనే టైటిల్ ను అనుకుంటున్నారనేది తాజా సమాచారం. ఇక ఈ సినిమాకి దర్శకుడిగా ఎవరు వ్యవహరించనున్నారనే విషయంలోనే స్పష్టత రావలసి వుంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లోను పవన్ ఒక సినిమా చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ రెండు సినిమాలకి కూడా గతంలో కంటే ఎక్కువగానే పవన్ పారితోషికం అందుకోనున్నాడనే వార్తే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

More Telugu News