Supreme Court: చీఫ్ జస్టిస్ ముందు కన్నీరు పెట్టిన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అరుణ్ మిశ్రా!

  • న్యాయమూర్తి లోయా మృతి కేసులో తనను శంకిస్తున్నారని ఆవేదన 
  • తాను ఎంతో కష్టపడి పని చేస్తున్నానని వ్యాఖ్య
  • అరుణ్ మిశ్రాను ఓదార్చిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్

సీబీఐ కోర్టు న్యాయమూర్తి లోయా మృతి కేసు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో తనను నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనవసరంగా లక్ష్యంగా చేసుకున్నారంటూ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అరుణ్ మిశ్రా కన్నీటి పర్యంతమయ్యారు. తన చిత్తశుద్ధిని అనుమానించారని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతో అన్నట్టుగా సమాచారం. ఈ రోజు దీపక్ మిశ్రాతో కాసేపు భేటీ అయిన అరుణ్ మిశ్రా మాట్లాడుతూ.. తాను ఎంతో కష్టపడి పని చేస్తున్నానని అన్నారు.

తనకు గతంలో ఉన్న సీజేఐలు టీఎస్ ఠాకూర్, జేఎస్ ఖేహార్ కూడా చాలా క్లిష్టమైన కేసులను అప్పగించారని తెలిపారు. అరుణ్ మిశ్రా కంటతడి పెట్టడంతో దీపక్ మిశ్రాతో పాటు అక్కడే ఉన్న జస్టిస్ చలమేశ్వర్ కూడా ఆయనను ఓదార్చారు. అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న అంశాలను తాము లేవనెత్తామేకానీ, ఎవరికీ వ్యతిరేకం కాదని జస్టిస్ చలమేశ్వర్ అన్నారట.


More Telugu News