deepika padukone: పోలీసు దుస్తుల్లో అద‌ర‌గొడుతున్న దీపికా ప‌దుకునే

  • ట్విట్ట‌ర్‌లో వైర‌ల్ అవుతున్న ఫొటోలు
  • ఓ సంస్థ ప్ర‌క‌ట‌న కోసం ఈ అవతారం
  • ఆక‌ట్టుకుంటున్న ఫొటోలు

'ప‌ద్మావ‌త్' చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకునే ఈ మ‌ధ్య ఎక్క‌డికి వెళ్లినా భారీ ఎత్తున న‌గ‌లు ధరించి, చీర‌క‌ట్టులో వెళుతోంది. కానీ అందుకు భిన్నంగా పోలీసు దుస్తులు ధ‌రించి దీపికా క‌నిపించిన ఫొటోలు ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్‌లో వైర‌ల్‌గా మారాయి. పోలీసు యూనిఫాం ధ‌రించి, జీపు మీద స్టైల్‌గా కూర్చున్న దీపికాను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఓ సంస్థ ప్ర‌క‌ట‌న కోసం దీపికా ఇలా త‌యారైంది. ఖాకీ దుస్తుల్లో దీపికాను చూసిన నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ ర‌ణ్‌వీర్ సింగ్ త్వ‌ర‌లో `సింబ` చిత్రంలో పోలీసుగా కనిపించ‌నున్న నేప‌థ్యంలో అత‌నికి దీపికా శిక్ష‌ణ ఇస్తోంద‌ని సరదాగా కామెంట్ చేస్తున్నారు.

More Telugu News