online: ఆన్‌లైన్ మార్కెట్ల‌లో ప‌తంజ‌లి ఉత్ప‌త్తులు

  • ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల‌లో అమ్మ‌కం
  • వెల్ల‌డించిన ప‌తంజ‌లి సీఈఓ
  • పెర‌గ‌నున్న వ్యాపారం

భార‌త‌దేశంలో ప్రాచుర్యం పొందిన పతంజ‌లి ఆయుర్వేద ఉత్ప‌త్తులు ఇక నుంచి ఆన్‌లైన్ మార్కెట్ల‌లో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌తంజ‌లి స్టోర్ల‌లో మాత్ర‌మే అందుబాటులో ఉన్న ఈ ఉత్ప‌త్తుల‌ను ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ వంటి దిగ్గ‌జ ఆన్‌లైన్ మార్కెట్ వెబ్‌సైట్ల‌తో పాటు పేటీఎం, బిగ్‌బాస్కెట్‌, నెట్ మెడ్‌, షాప్‌క్లూస్ వంటి వెబ్‌సైట్ల‌లో కూడా అమ్మ‌కానికి అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు ప‌తంజ‌లి సీఈఓ ఆచార్య బాల‌కృష్ణ తెలిపారు. త‌మ వ్యాపారాన్ని పెంచుకోవ‌డంలో భాగంగా ఆన్‌లైన్ మార్కెట్ సంస్థ‌ల‌తో ఒప్పందం చేసుకున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

More Telugu News