aadhar: ఆధార్‌ కార్డులో కొత్తగా ఫేస్‌ రికగ్నిషన్‌ ఫీచర్‌!

  • సర్క్యులర్‌ జారీ చేసిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా
  • ఫింగర్ ప్రింట్‌తో ఇబ‍్బందులు పడుతోన్న వృద్ధులు వంటి వారికి ఉపయోగకరం
  • ఈ ఏడాది జులై 1 నుంచి ప్రారంభం

అన్నింటికీ తప్పనిసరి అవుతోన్న ఆధార్ కార్డును మరింత సులువుగా ఉపయోగించుకునేందుకు యూనిక్‌ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ).. ఆధార్‌ను మార్పులు, చేర్పులతో ముందుకు తెస్తోంది. ఆధార్ వివరాలు లీకవుతున్నాయన్న వార్తలు వస్తుండడంతో ఇటీవలే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డులో వర్చువల్ ఐడీని క్రియేట్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

 ఫింగర్  ప్రింట్‌తో ఇబ‍్బందులుపడుతున్న వృద్ధులు, తదితరులకు ఉపయోగపడేలా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుపుతూ ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. ఆధార్ వినియోగదారులకు ఫేస్‌ రికగ్నిషన్‌ ఫీచర్‌ను జోడిస్తున్నట్టు, ఈ కొత్త పద్ధతి ఈ ఏడాది జులై 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.    

More Telugu News