Recording Dance: కోనసీమలో అడ్డూ అదుపూ లేని అశ్లీల నృత్యాలు... ఏమీ చేయలేకపోతున్న పోలీసులు!

  • సంక్రాంతి సంబరాల పేరిట అశ్లీల నృత్యాలు
  • జోరుగా కోడి పందేలు, గుండాట, పేకాట, రికార్డింగ్ డ్యాన్సులు
  • ప్రజా ప్రతినిధుల అండతో సాగుతున్న ఆటలు 

కోనసీమ సంక్రాంతి సంబరాల పేరిట పలు ప్రాంతాలలో అశ్లీల నృత్యాలు హోరెత్తుతుండగా, పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడెక్కడో ఉపాధి కోసం తరలి వెళ్లిన గ్రామవాసులు సంక్రాంతి కోసం తరలివచ్చిన వేళ, వారికి ఆనందాన్ని కలిగించడం కోసం ఓ వైపు సంప్రదాయ కోడి పందేలు, గుండాట, పేకాట వంటి ఆటలు ఏర్పాటు కాగా, వారికి మరింత ఆహ్లాదాన్ని కలిగించడం కోసం పలు ప్రాంతాల్లో రికార్డింగ్ డ్యాన్స్ లను గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది.

అటు తిరిగితే కోడి పందేలు, ఇటు తిరిగితే రికార్డింగ్ డ్యాన్సుల జోరు కొనసాగుతుండగా, వాటిని అరికట్టాల్సిన పోలీసులు, పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడితో మిన్నకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రికార్డింగ్ డ్యాన్సులు అర్థరాత్రి తరువాత అశ్లీల నృత్యాలుగా మారిపోయాయి. వీటికి ప్రజా ప్రతినిధుల అండదండలు కూడా ఉండడంతో నిర్వాహకులు ఏ మాత్రం భయపడకుండా సంక్రాంతి వేడుకలను తమదైన శైలిలో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా, తూర్పు గోదావరి జిల్లా, మల్కిపురం, తూర్పుపాలెం, శంకరగుప్తం, కేశనపల్లి, సఖినేటిపల్లి, మగటపల్లి, కరవాక గ్రామాలలో అశ్లీల నృత్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని తెలుస్తోంది.

More Telugu News