Kim Jong Un: తూచ్... నేనేమీ అలా అనలేదు: డొనాల్డ్ ట్రంప్

  • కిమ్ తో సత్సంబంధాలు ఉన్నాయన్న ట్రంప్
  • ప్రత్యేక ఇంటర్వ్యూను ప్రచురించిన వాల్ స్ట్రీట్ జర్నల్
  • తానలా అనలేదని వివరణ ఇచ్చిన ట్రంప్

"కిమ్ జాంగ్ ఉన్ తో సత్సంబంధాలు ఉన్నాయని నేను చెప్పానట. కచ్చితంగా నేను అలా అనలేదు. అదృష్టవశాత్తూ నేను సదరు విలేకరితో మాట్లాడిన సంభాషణలను రికార్డు చేయించాను" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన్ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన 'వాల్ స్ట్రీట్ జర్నల్', ఓ కథనాన్ని ప్రచురిస్తూ, నార్త్ కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ తో మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు పేర్కొంది.

 ఈ దినపత్రిక కథనంలో చాలా అసత్యాలు ప్రచురించారని వైట్ హౌస్ ఆక్షేపించింది. సరైన సమయంలో కిమ్ తో చర్చలు జరిపేందుకు కూడా తాను సిద్ధమని ట్రంప్ వ్యాఖ్యానించారని తెలిపింది. దీనిపై స్పందించిన ట్రంప్, "నేను ఏం మాట్లాడానో, దాని అర్థమేంటో వారికి బాగా తెలుసు. వారికి కావాల్సింది ఓ స్టోరీ మాత్రమే... ఫేక్ న్యూస్" అని తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

More Telugu News