Sankranthi: ఈ సంక్రాంతి ప్రజలకు కీడట... కొత్త ప్రచారంతో ఆంజనేయుని గుడులకు పరుగులు!

  • కీడును తెచ్చే సంక్రాంతి
  • పోవాలంటే ఇంట్లోని చిన్నారులు ఆంజనేయుని గుడి తిరగాలి
  • కిటకిటలాడుతున్న గుడులు 

ఈ సంక్రాంతి పండగ కీడును తేనున్నదట. కీడు పోవాలంటే, ప్రతి ఇంటిలోని చిన్నారులూ ఆంజనేయస్వామి గుడులకు వెళ్లి ప్రదక్షిణలు చేయాలట. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తాజా ప్రచారమిది. వాట్స్ యాప్, సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ ప్రచారం జోరుగా సాగుతూ ఉండటంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఆంజనేయుని గుడులకు పరుగులు పెట్టడం కనిపిస్తోంది.

సంక్రాంతి కీడును తేనుందని, భారంగా వచ్చిందని, ఎటువంటి నష్టమూ జరుగకుండా ఉండాలంటే, ఇంట్లోని పిల్లలతో హనుమంతుని గుడి చుట్టూ తిప్పించాలన్న పుకార్ల ప్రచారాన్ని తొలుత ఎవరు మొదలు పెట్టారోగానీ, ఉదయం నుంచి ఆంజనేయుని గుడులు కిటకిటలాడుతున్నాయి. కీడు ప్రచారం నిజమైనా, అబద్ధమైనా ఓ సారి గుడికి వెళ్లి ప్రదక్షిణ చేసి వస్తే పోయేదేముందని చెబుతూ అత్యధికులు గుళ్లకు వెళుతుండడంతో దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి.

More Telugu News