2018: 2018లో తొలిసారి భూమికి ఏలియన్స్... మెక్సికోలో కనిపించిన యూఎఫ్ఓ వీడియో!

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • ఎగిరే పళ్లెంలో కాకుండా హ్యూమనాయిడ్ వాహకంలో!
  • మెక్సికోలోని బాజాలో ఘటన

ఏలియన్స్ మరోసారి భూమ్మీదకు వచ్చాయా? ఎక్కడో గ్రహాంతరాళం నుంచి భూమిపైకి వచ్చి వెళ్లాయా? మెక్సికో వాసులు మాత్రం అవుననే అంటున్నారు. ఈ సంవత్సరంలో తొలిసారిగా ఏలియన్స్ వచ్చి వెళ్లాయని చెబుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇప్పటివరకూ ఎగిరే పళ్లెం మాదిరిగా కనిపించే నౌకల్లోనే ఏలియన్స్ ప్రయాణాలు సాగిస్తుంటాయని భావిస్తుండగా, తొలిసారిగా హ్యూమనాయిడ్ రూపంలో ఉన్న గుర్తు తెలియని వస్తువు మెక్సికోలోని బాజా రాష్ట్రంలో కనిపించింది. దీన్ని చాలా మంది వీడియో తీశారు. ఇక దీనిపై కాన్ స్పిరసీ థియరిస్టు రమీరెజ్ మాట్లాడుతూ, గ్రహాంతరవాసులు మన చర్యలను నిత్యమూ పరిశీలిస్తుంటారని, మనం చేస్తున్న ఉపగ్రహ ప్రయోగాలను వారు యుద్ధ సన్నాహకాలుగా భావిస్తుంటాయని తెలపడం గమనార్హం. ఓ సన్నని గొట్టం మాదిరి ఆకారం గాల్లో వెళుతుంటే తీసిన ఓ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News