అప్పుడు, నన్ను పెళ్లి చేసుకోవాలని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు : సినీ నటి నమిత
Sat, Jan 13, 2018, 10:26 PM

- 2009 అక్టోబరు 23వ తేదీన తిరుచ్చిలో ఈ సంఘటన జరిగింది
- ఓ షోలో పాల్గొనేందుకు నేను మా మేనేజర్ తో వెళ్లా
- ‘కారు డ్రైవర్’ ని అంటూ ఓ వ్యక్తి వచ్చాడు
- ఆ కారు ఎక్కిన తర్వాత తెలిసింది కిడ్నాప్ చేశాడని: నమిత
మా కోసం విమానాశ్రయం వద్ద వారి డ్రైవర్ ఎదురు చూస్తున్నాడని... నిర్వాహకుడు బదులిచ్చాడు. ‘నేను కారు ఎక్కాను’ అని చెప్పడంతో సదరు నిర్వాహకుడు ఆశ్చర్యపోయాడు. నేను ప్రయాణిస్తున్న కారు చుట్టూ సుమారు ఆరేడు కార్లు వెంబడించాయి. డ్రైవింగ్ మీద ఏకాగ్రత చూపకుండా కారు మిర్రర్ లో నుంచి డ్రైవర్ నన్ను చూస్తుండటాన్ని నేను గమనించా.
‘ఇదేంటీ ఇట్లా చూస్తున్నాడు!’ అని నేను ఆశ్చర్యపోయాను. చిరునవ్వు నవ్వుతూ కారు నడుపుతూ, ఏదో స్వర్గంలో ఉన్నట్టు ఫీలయ్యాడు. కుర్రాడు సంతోషంగా ఉన్నాడని నేను అనుకుంటున్నా. అయితే, ఏదో గోడౌన్ లోకి నన్ను తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడనే విషయం ఆ తర్వాత తెలిసింది. మేము ప్రయాణిస్తున్న కారు ఉన్నపళంగా ఆపేయడంతో నేను ఆశ్చర్యపోయా.
ముగ్గురు నలుగురు మహిళా కానిస్టేబుల్స్ నా చేతిని పట్టుకుని కారులో నుంచి బయటకు లాగేశారు. వేరే కారులోకి వెళ్లి కూర్చోమని చెప్పారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాకపోవడంతో.. జాన్ ని ప్రశ్నిస్తే. ‘మ్యామ్ మీరు కిడ్నాప్ అయ్యారు’ అని చెప్పాడు. నాకైతే ఒకటే నవ్వు..‘ కిడ్నాప్ అయ్యానా?’ అంటూ నేను పగలబడి నవ్వుతుంటే, జాన్ వణికిపోయాడు’ అని నమిత చెప్పుకొచ్చింది. అయితే, తమ మేనేజర్ జాన్ పంపిన మెస్సేజ్ తో సదర్ నిర్వాహకుడు అప్రమత్తమవడం, పోలీసులు రావడంతో తాను బయటపడ్డానని ఆమె చెప్పింది.