Chandrababu: ముళ్లపూడి బాపిరాజుకు చంద్రబాబు వార్నింగ్!

  • మంత్రి మాణిక్యాలరావుతో వివాదం
  • పద్ధతి మార్చుకోవాలంటూ సీఎం వార్నింగ్
  • త్రిసభ్య కమిటీ ఏర్పాటు

మంత్రి మాణిక్యాలరావు, పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుల మధ్య నెలకొన్న వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. ఈ సందర్భంగా బాపిరాజు తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రపక్ష నేతలతో సర్దుకుపోవాలని బాపిరాజుకు చెబుతున్నప్పటికీ అర్థం చేసుకోవడం లేదని మండిపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు.

మరోవైపు వీరిద్దరి వివాదంపై చంద్రబాబు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో మంత్రులు పుల్లారావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే వర్మలు సభ్యులుగా ఉన్నారు. వీలైనంత త్వరలో నివేదికను ఇవ్వాలంటూ కమిటీని చంద్రబాబు ఆదేశించారు. ప్రధానితో భేటీ అయిన వెంటనే... రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో టీడీపీ-బీజేపీల మధ్య గ్యాప్ తగ్గించే అంశాలపై సీఎం ఫోకస్ చేయడం గమనార్హం. 

More Telugu News