Donald Trump: ట్రంప్ ఈజ్ ఆల్ రైట్: వైద్య నివేదిక

  • ట్రంప్ కు వాషింగ్టన్ లో వైద్య పరీక్షలు
  • ఆరోగ్యం బాగుందన్న డాక్టర్
  • 16న మీడియాకు పూర్తి నివేదిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం భేషుగ్గా ఉందని ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ రోనీ జాక్సన్ వైద్య బృందం తెలిపింది. వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ లో ట్రంప్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. కొన్ని గంటల పాటు కొనసాగిన ఈ పరీక్షల్లో ట్రంప్ కు బీపీ, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, గుండె స్పందన, బరువు వంటి పరీక్షలు చేశారు.

పరీక్షల అనంతరం డాక్టర్ రోనీ జాక్సన్ మాట్లాడుతూ, ట్రంప్ ఆరోగ్యం చక్కగా ఉందని చెప్పారు. గత మూడు ప్రభుత్వాల నుంచి అధ్యక్షులకు డాక్టర్ రోనీనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ట్రంప్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి నివేదికను జనవరి 16న మీడియాకు వెల్లడించనున్నారు.

అమెరికా అధ్యక్షుడికి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించడం సాధారణమైన అంశమే. అయితే, ట్రంప్ మానసిక స్థితిపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఆయన మెంటల్ గా ఫిట్ గా లేరని ఆరోపించారు. దీంతో, ఆయన వైద్య పరీక్షలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరోవైపు, ట్రంప్ కు మెంటల్ ఫిట్ నెస్ టెస్ట్ చేయలేదని వైట్ హస్ వెల్లడించింది.

More Telugu News