bihar: బీహార్ సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. సురక్షితంగా తప్పించుకున్న నితీశ్!

  • బీహార్‌ బక్సర్‌ జిల్లాలోని నందన్‌ ప్రాంతంలో ఘటన
  • భద్రతా సిబ్బందికి గాయాలు
  • నా నిబద్ధత న‌చ్చ‌ని వారు ఇలా దాడులు చేస్తున్నారు-నితీశ్ కుమార్
  • నేను మారుమూల గ్రామాల్లోనూ పర్యటిస్తాను..

బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విస‌ర‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌లో కాన్వాయ్‌లోని భద్రతా సిబ్బందికి గాయాల‌య్యాయి. బీహార్‌ బక్సర్‌ జిల్లాలోని నందన్‌ ప్రాంతంలో ఆయ‌న‌ పర్యటిస్తోన్న స‌మ‌యంలో ఈ దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ముఖ్యమంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు.

త‌న‌పై చేసిన ఈ దాడి ప్ర‌య‌త్నంపై నితీశ్ కుమార్ మాట్లాడుతూ... బీహార్ అభివృద్ధి విషయంలో తన నిబద్ధత న‌చ్చ‌ని వారు ఇలా దాడులు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఈ దాడి ఎవ‌రి ప‌నో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పారు. తాను రాష్ట్ర రాజధానిలో కూర్చొని ప్రజలను పాలించబోన‌ని, మారుమూల గ్రామాల్లోనూ పర్యటించి అక్కడి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తాన‌ని, తనను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.   

More Telugu News