pslv-c40: పీఎస్ఎల్వీ-సీ40 విజయవంతం.. విఫలం తర్వాత ఘన విజయం సాధించిన ఇస్రో

  • పీఎస్ఎల్వీ-సీ40 విజయవంతం
  • 31 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో
  • న్యూ ఇయర్ గిఫ్ట్ అని ప్రకటించిన శాస్త్రవేత్తలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ40 విజయవంతమైంది. తనతో పాటు తీసుకెళ్లిన 31 శాటిలైట్లను ఈ రాకెట్ నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగంతో ఇస్రో చరిత్ర పుటల్లోకి ఎక్కింది. భారత్ కు చెందిన 100 ఉపగ్రహాలను ఇప్పటి వరకు నింగిలోకి పంపింది. గత ఆగస్టులో ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ -39విఫలమైన సంగతి తెలిసిందే.

ఆ పరాజయంతో డీలా పడని ఇస్రో... మరింత పట్టుదలతో తాజా ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ఈరోజు కక్ష్యలోకి పంపిన ఉపగ్రహాల్లో 28 విదేశీ శాటిలైట్లు ఉన్నాయి. వీటిలో కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, కొరియా, యూకే, అమెరికాకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. భారతీయులకు ఇది న్యూ ఇయర్ గిఫ్ట్ అని ప్రకటించారు. 

More Telugu News