agnathavasi: 'అజ్ఞాతవాసి'లో వెంకటేష్ పోషించిన పాత్ర ఇదే!

  • పవన్ సినిమాలో నటించిన వెంకీ
  • నాలుగు నిమిషాల పాత్ర
  • రెండు వారాల తర్వాత కలిపే అవకాశం

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో వచ్చిన 'అజ్ఞాతవాసి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అయితే, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటించారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభానికి ముందు టైటిల్స్ లో వెంకటేష్ కు ధన్యవాదాలు కూడా చెప్పారు. అయితే, సినిమాలో మాత్రం వెంకటేష్ ఎక్కడా కనబడలేదు. అయితే, ఈ సినిమాలో వెంకీ నాలుగు నిమిషాల పాటు కనపడే ఓ పోలీస్ పాత్రను పోషించారట. ఓ ఫైట్ తర్వాత ఎంట్రీ ఇచ్చే సీన్ లో వెంకీ కనపడతాడట. అయితే, రెండు వారాల తర్వాత ఈ సీన్ ను కలుపుదామని యూనిట్ సభ్యులు భావిస్తున్నారని సమాచారం.

More Telugu News