pari: కొత్త చిత్రం టీజ‌ర్‌ విడుద‌ల చేసిన అనుష్క శ‌ర్మ‌.... కోహ్లీ ఫొటోను జోడిస్తూ నెటిజ‌న్ల కామెంట్లు!

  • భ‌య‌పెడుతున్న 'ప‌రి' చిత్రం టీజ‌ర్‌
  • విరాట్ బెదిరిపోయాడంటూ కామెంట్లు
  • ఫ‌న్నీ ఫొటోలు సృష్టిస్తున్న నెటిజ‌న్లు

విరాట్ కోహ్లీతో పెళ్లయ్యాక అనుష్క శ‌ర్మ సినిమాల్లో బిజీగా మారింది. ఒక పక్క జీరో చిత్రం షూటింగ్‌లో న‌టిస్తూనే, మ‌రో ప‌క్క తాను న‌టించి, నిర్మించిన 'ప‌రి చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను కూడా కొన‌సాగిస్తోంది. ఇందులో భాగంగానే ఈ సినిమా టీజ‌ర్‌ను అనుష్క విడుద‌ల చేసింది. అందులో అనుష్క గెట‌ప్ భ‌య‌పెట్టే విధంగా ఉంది. దీంతో ఈ టీజ‌ర్‌కి విరాట్‌ ఫొటోను జోడిస్తూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

అనుష్క అందానికి క్లీన్‌ బౌల్డ్‌ అయిన విరాట్‌.. ‘పరి’లో అనుష్కను చూసి బెదిరిపోయాడని అంటున్నారు. అంతేకాకుండా విరాట్ ముఖాన్ని పోస్ట‌ర్‌లో క‌లిపి ఫ‌న్నీ ఫొటోలు కూడా సృష్టిస్తున్నారు. హోలీకి ఇది విడుదలవుతున్న సందర్భంగా ‘హోలీ విత్‌ పరి’ అన్న ట్యాగ్‌లైన్‌తో బుధవారం ఈ టీజ‌ర్‌ను ట్రెండ్ చేశారు. దీన్ని ‘కోహ్లీ విత్‌ పరి’గా మార్చి స‌రదా కామెంట్లు చేశారు. మరికొందరైతే దక్షిణాఫ్రికా మ్యాచ్‌కి ముందు కోహ్లీకి అనుష్క ఈ పోస్టర్‌ చూపించిందని, అందుకే మ్యాచ్‌లో కోహ్లీ సేన ఓడిపోయిందని కామెంట్లు పెడుతున్నారు.

More Telugu News