సీబీఐ కోర్టులో లొంగిపోయిన శశికళ భర్త నటరాజన్

11-01-2018 Thu 14:11
  • దిగుమతి చేసుకున్న కారుపై సుంకం ఎగవేత
  • 1994 నాటి కేసులో నటరాజన్ కు జైలు శిక్ష
  • ఇన్నాళ్లూ కోర్టుకు హాజరుకాని నటరాజన్
బహిష్కృత అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ, తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ భర్త ఎం.నటరాజన్ సీబీఐ కోర్టు ముందు లొంగిపోయారు. బ్రిటన్ నుంచి విలాసవంతమైన కారు దిగుమతికి సంబంధించి 1994లో సుంకం ఎగవేశారన్న కేసును ఆయన ఎదుర్కొంటున్నారు.

గత విచారణలకు ఆయన హాజరు కాలేదు. ఆరోగ్యపరమైన కారణాలను చూపించి తప్పించుకు తిరుగుతున్నారు. ఇదే కేసులో చెన్నైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 2010లో నటరాజన్, మరో ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. గత నవంబర్లో మద్రాస్ హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది. దీంతో ఆయన కోర్టు ముందు లొంగిపోయారు. 1994లో లెక్సస్ కారును దిగుమతి చేసుకున్న నటరాజన్ దాన్ని అప్పటికే వాడిన కారుగా పత్రాలను తారుమారు చేసి చూపించి పన్ను ఎగ్గొట్టారు.