kalyan: చిరూ చిన్నల్లుడికి హీరోయిన్ ఖరారైపోయినట్టే!

  • హీరోగా చిరూ చిన్నల్లుడు
  • కథానాయికగా మేఘా ఆకాశ్ 
  • దర్శకుడిగా రాకేశ్ శశి 
  • త్వరలో సెట్స్ పైకి

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ హీరోగా తెలుగు తెరకి పరిచయం కానున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం కల్యాణ్ ఇప్పటికే నటనలోను .. డాన్స్ .. ఫైట్స్ లోను శిక్షణ తీసుకున్నాడు. 'జత కలిసే' సినిమాను గతంలో తెరకెక్కించిన రాకేశ్ శశి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు.

చిరంజీవి కూడా ఈ కథ విని కొన్ని మార్పులు .. చేర్పులు చెప్పారట. ఆయన చెప్పినట్టుగా స్క్రిప్ట్ పై కసరత్తు జరుగుతోందట. ఈ సినిమాలో కథానాయికగా 'మేఘా ఆకాశ్'ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఎంపిక దాదాపు ఖరారైపోయిందనే అంటున్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఎంతోకాలం పట్టదని చెబుతున్నారు. ప్రస్తుతం నితిన్ జోడీగా మేఘా ఆకాశ్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.     

More Telugu News