harvey weinstein: హాలీవుడ్ లైంగిక వేధింపుల నిర్మాత‌కు ఘోర అవమానం... చెంప‌దెబ్బలు.. వీడియో చూడండి!

  • ఓ హోట‌ల్‌లో తిన‌డానికి వెళ్లిన హార్వీ వీన్‌స్టీన్‌
  • ఫొటో దిగాల‌ని కోరిన ఓ వ్య‌క్తి
  • హార్వీ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో చెంప‌దెబ్బ కొట్టిన వైనం

దాదాపు 30 మంది న‌టీమ‌ణుల‌ను లైంగికంగా వేధించిన హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టీన్‌కి ఘోర అవ‌మానం జ‌రిగింది. ప్ర‌స్తుతం రీహాబిలిటేష‌న్‌లో ఉన్న ఆయ‌న, జ‌న‌వ‌రి 9 రాత్రి స‌మ‌యంలో అరిజోనాలో ఉన్న ప్యార‌డైజ్ రెస్టారెంట్‌కి భోజనం చేసేందుకు వ‌చ్చారు. అక్క‌డ ఓ వ్య‌క్తి ఫొటో దిగాల‌ని కోరాడు. అందుకు హార్వీ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో అత‌ని మీద రెండు సార్లు చేయి చేసుకున్నాడు. మహిళలను ఇబ్బంది పెట్టినందుకు ఈ శాస్తి అని ఆ వ్య‌క్తి అన్నాడు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఒక‌టి ఇంట‌ర్నెట్‌లో ప్ర‌త్య‌క్షమైంది. చెంప దెబ్బ కొట్టిన వ్య‌క్తి, మ‌రో వ్య‌క్తితో వీడియో తీయ‌మ‌ని చెప్ప‌డం, హార్వీతో వ‌చ్చిన వేరే వ్య‌క్తి వీడియో తీస్తుండ‌గా చేయి అడ్డం పెట్ట‌డం, హార్వీని వాళ్లు బూతులు తిడుతుండ‌టం ఇందులో చూడొచ్చు. ఈ వీడియోను మొద‌టిసారిగా టీఎంజెడ్ అనే వెబ్‌సైట్ విడుద‌ల చేసింది. అయితే, హార్వీ ప్ర‌తినిధులు దీనిపై స్పందిస్తూ, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.

More Telugu News