Drone Rickshaw: ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. త్వరలో ఎగిరే రిక్షాలు!.. ప్రకటించిన కేంద్రమంత్రి

  • శుభవార్త చెప్పిన కేంద్ర మంత్రి
  • డ్రోన్ రిక్షాలను అందుబాటులోకి తెచ్చే యోచన 
  •  అమెరికా, జర్మనీ దేశాల్లో ఇప్పటికే చక్కర్లు కొడుతున్న డ్రోన్‌లు

ట్రాఫిక్ జామ్‌లతో ఇబ్బందులు పడుతున్న వారికి కేంద్రమంత్రి జయంత్ సిన్హా శుభవార్త చెప్పారు. దేశంలోని  పలు నగరాల్లో ప్రయాణమంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఇకపై ఇటువంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు కేంద్ర మంత్రి. నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు భవిష్యత్తులో డ్రోన్ రిక్షాలను అందుబాటులోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
 
తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఆటో ప్రయాణం, ఆకాశంలో ప్రయాణం ఖర్చు ఒకటేనని తేలిందని, కాబట్టి త్వరలోనే డ్రోన్ రిక్షాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు యోచిస్తున్నట్టు చెప్పారు. అమెరికా, జర్మనీ తదితర దేశాల్లో ఇప్పటికే ఈ తరహా టెక్నాలజీతో ఎయిర్ సర్వీసులు నడుస్తున్నట్టు వివరించారు. త్వరలోనే భారత్‌లోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని, విమానయానశాఖ ఇందుకు సంబంధించిన నిబంధనలు రూపొందిస్తోందని మంత్రి తెలిపారు.  

More Telugu News