skiing: అంత‌ర్జాతీయ‌ స్కీయింగ్ పోటీల్లో భార‌త క్రీడాకారిణికి ప‌త‌కం... పొగిడిన ప్ర‌ధాని

  • ఈ పోటీల్లో భార‌త్‌కి ఇదే మొద‌టి ప‌త‌కం
  • ర‌జ‌త ప‌త‌కం గెల్చుకున్న ఆంచ‌ల్ ఠాకూర్‌
  • ట‌ర్కీలో జ‌రిగిన పోటీలు

అంత‌ర్జాతీయ స్కీయింగ్ కాంపిటీష‌న్‌లో ర‌జ‌త ప‌త‌కం గెల్చినందుకుగాను భారత క్రీడాకారిణి ఆంచ‌ల్ ఠాకూర్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పొగిడారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ట్వీట్ చేశారు. ఈ పోటీల్లో భార‌త‌దేశానికి మొద‌టిసారి ప‌త‌కం సాధించి దేశ‌ఖ్యాతి ఇనుమ‌డింపజేసిందని ప్ర‌ధాని పేర్కొన్నారు. ట‌ర్కీలోని పాలందోకెన్ స్కీ సెంట‌ర్‌లో జ‌రిగిన ఆల్పైన్ ఎయ్‌డ‌ర్ 3200 క‌ప్ పోటీల్లో ఆంచ‌ల్ ర‌జ‌త ప‌త‌కం సాధించింది. ఈ పోటీల‌ను ఫెడ‌రేష‌న్ ఇంట‌ర్నేష‌న‌లె దె స్కీ సంస్థ నిర్వ‌హించింది.

'అంత‌ర్జాతీయ‌ స్కీయింగ్‌లో ప‌త‌కం సాధించినందుకు సంతోషం. ట‌ర్కీలో నువ్వు సాధించిన చారిత్ర‌క‌ విజ‌యానికి దేశం గ‌ర్విస్తోంది. భ‌విష్య‌త్తులో కూడా ఇలాంటి విజ‌యాలు మ‌రెన్నో సాధించాల‌ని కోరుకుంటున్నాను' అని మోదీ ట్వీట్ చేశారు.

More Telugu News