alligators: గ‌డ్డ క‌ట్టే చ‌లిలో మొస‌ళ్ల క‌ష్టాలు... వైర‌ల్ వీడియో చూడండి!

  • ముక్కులు బ‌య‌ట‌పెట్టి గాలి పీల్చుకుంటాయి  ‌
  • అమెరికాలో భ‌యంక‌రంగా త‌గ్గిన ఉష్ణోగ్ర‌త‌లు
  • స‌హ‌జ ప్ర‌వృత్తిని ప్ర‌ద‌ర్శిస్తున్న జంతువులు

అమెరికాలో ప్ర‌స్తుతం న‌దులు, స‌ర‌స్సులు, కొల‌నులు అన్నీ గ‌డ్డక‌ట్టుకుపోయాయి. దీంతో వాటిలో నివ‌సించే జంతువుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. చేప‌లు, క‌ప్ప‌ల ప‌రిస్థితి ప‌క్క‌న పెడితే ఉభ‌య‌చ‌రాలైన మొస‌ళ్ల ప‌రిస్థితి మరీ ఘోరంగా మారింది. గ‌డ్డ క‌ట్టే చ‌లి నుంచి అవి ఎలా ర‌క్ష‌ణ పొందుతాయో తెలిపే వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఇందులో గడ్డ‌క‌ట్టిన నీటి ప్రాంతంలో మొస‌ళ్ల ముక్కులు మాత్రం బ‌య‌టికి ఉండ‌టం చూడొచ్చు.

నిజానికి ఇది ఒక ర‌క‌మైన సుప్తావ‌స్థ ప‌రిస్థితి. సాధార‌ణంగా శీత‌ల ర‌క్తం గ‌ల జంతువులు ఇలా చ‌లికాలం పూట మగతగా పడుంటాయి. ఈ స‌మ‌యంలో వాటి జీవ‌క్రియారేటు త‌గ్గిపోతుంది. నేల మీద ఉండే జీవులు బొరియ‌ల్లో, చెరియ‌ల్లో త‌ల‌దాచుకుంటాయి. కానీ భారీ శ‌రీరం కార‌ణంగా మొస‌ళ్ల‌కు ఆ అవ‌కాశం చాలా త‌క్కువ‌. దీంతో ఇలా గాలి కోసం ముక్కులు బ‌య‌ట‌పెట్టి, గ‌డ్డ క‌ట్టిన నీటిలో వేలాడుతుంటాయి. అమెరికాలో ఉత్త‌ర క‌రోలినాలో ఉన్న షార్లెట్ రివ‌ర్ స్వాంప్ పార్క్‌లో ఈ దృశ్యం క‌నిపించింది.

More Telugu News