America: అమెరికా రహస్య నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం.. అట్లాంటిక్ సముద్రంలో కూలిన వైనం!

  • ప్రయోగం రెండో దశలో ఇబ్బందులు
  • ఏమైందో తెలియని ఉపగ్రహం
  • కూలిపోయి ఉంటుందని భావిస్తున్న శాస్త్రవేత్తలు

ఆదివారం అమెరికా ప్రయోగించిన రహస్య నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. మొదటి దశను విజయవంతంగా పూర్తిచేసిన రాకెట్ నుంచి రెండో దశలో ఉపగ్రహం వేరుకావడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఆ తర్వాత అది ఏమైందో తెలియరాలేదు. అయితే ఉపగ్రహం అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయి ఉంటుందని కొందరు చెబుతున్నారు.  

స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ఆదివారం అమెరికా రహస్య ఉపగ్రహం జుమాను నింగిలోకి మోసుకెళ్లింది. అయితే రెండో దశలో ప్రయోగం విఫలం కావడంతో ఉపగ్రహం సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రయోగంపై తాము ఇప్పటికిప్పుడు ఎటువంటి వివరాలను బయటకు వెల్లడించలేమని స్పేస్ ఎక్స్ ప్రతినిధి తెలిపారు. కాగా, ఈ ఉపగ్రహాన్ని నార్త్‌రప్ గ్రుమన్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. నవంబరులోనే జుమాను ప్రయోగించాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేశారు.

More Telugu News