TTD: తిరుమలలో మందు కొడుతూ దొరికిపోయిన వ్యక్తి!

  • వరాహస్వామి ఆలయం సమీపంలో ఘటన
  • అత‌డి ప‌క్క‌న బీరు బాటిల్, చెప్పులు కనపడిన వైనం
  • టీటీడీ సిబ్బంది నిఘా వైఫల్యం

తిరుమ‌ల‌ మాడ వీధుల్లో వరాహస్వామి ఆలయం సమీపంలో కల్వర్టులో కూర్చుని ఓ వ్య‌క్తి హాయిగా మద్యం తాగుతూ క‌నిపించాడు. అత‌డి ప‌క్క‌న మద్యం బాటిల్, చెప్పులు ఉన్నాయి. తిరుమలలో త‌రుచూ ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తిరు‌మ‌ల సిబ్బంది స‌రిగ్గా ప‌ని చేయ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఆ ప్రాంతం అంతటా సీసీ కెమెరాలు ఉన్న‌ప్ప‌టికీ ఓ వ్య‌క్తి మ‌ద్యం తాగుతూ మీడియాకు చిక్క‌డంతో అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. టీటీడీ సిబ్బంది, విజిలెన్స్‌ అధికారులు చూసీ చూడ‌న‌ట్లు వ‌దిలేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

TTD

More Telugu News