sundeep kishan: మహేశ్ బాబు చేతుల మీదుగా 'మనసుకు నచ్చింది' ట్రైలర్ రిలీజ్

  • మంజుల దర్శకత్వంలో ' మనసుకు నచ్చింది'
  • యూత్ ను ఆకట్టుకుంటోన్న ట్రైలర్ కంటెంట్ 
  • జనవరి 26వ తేదీన సినిమా విడుదల  

మహేశ్ బాబు సోదరి మంజుల దర్శకత్వంలో 'మనసుకు నచ్చింది' సినిమా రూపొందుతోంది. సందీప్ కిషన్ హీరోగా .. అమైరా దస్తూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా చివరి దశకి చేరుకుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి, తాజాగా ట్రైలర్ ను వదిలారు.

 మహేశ్ బాబు చేతుల మీదుగా కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అల్లరి .. సందడి .. సంబరం కలగలిసిన బిట్స్ తో ఈ ట్రైలర్ ను కట్ చేశారు. యూత్ కి కనెక్ట్ అయ్యేలా .. ఆకట్టుకునేలా ఈ ట్రైలర్ వుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాను, ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నారు. యూత్ ను ఈ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి మరి.

More Telugu News