Pakistan: పాకిస్థాన్ లో అంతకంతకూ విస్తరిస్తున్న ఐఎస్ఐఎస్.. భారత్ కు పెను ముప్పు!

  • పాక్ లో విస్తరిస్తున్న ఉగ్రవాదం
  • ఉత్తర సింధ్, బలూచ్ లలో వేగంగా విస్తరణ
  • 2017లో 131 శాతం పెరిగిన ఉగ్రదాడులు

ప్రపంచంలోనే అత్యంత కిరాతకమైన ఉగ్రవాద సంస్థగా పేరుగాంచిన ఐఎస్ఐఎస్ మన దాయాది దేశం పాకిస్తాన్ లో వేగంగా విస్తరిస్తోంది. పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ సంస్థ వెల్లడించిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ముఖ్యంగా ఉత్తర సింధ్, బలూచిస్థాన్ ప్రాంతాల్లో ఐఎస్ విస్తృతంగా వ్యాపిస్తోందని ఈ సంస్థ పేర్కొంది.

బలూచిస్థాన్ లో ఇద్దరు చైనీయులను హత్య చేసింది కూడా ఐఎస్ అని తెలిపింది. మరోవైపు, బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సంస్థల కన్నా తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్, జమాతుల్ అహ్రార్ సంస్థలు పాక్ భద్రతకు పెను ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొంది. 2016తో పోలిస్తే 2017లో పాక్ పై సీమాంతర ఉగ్రదాడులు 131 శాతం పెరిగాయని చెప్పింది. పాక్ లో ఐఎస్ ప్రాబల్యం పెరిగితే భారత్ భద్రతకు కూడా ముప్పేనని విశ్లేషకులు అంటున్నారు.

More Telugu News