Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • ప్లాన్స్ వర్కౌట్ కావంటున్న కాజల్ 
  • తదుపరి చిత్రం పనుల్లో విక్రంకుమార్ 
  • అనుష్క 'భాగమతి'కి రికార్డు వ్యూస్ 
  • హిందీ సినిమాలో నటించనున్న శివాజీ? 

*  'ఏదో ఒక ప్రణాళిక ప్రకారం పక్కాగా సాగాలంటే ఇక్కడ కుదరదు..' అంటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. "మన నిజ జీవితంలో ప్లాన్ వేసుకుని ఆ ప్రకారం నడచుకోవచ్చు. అయితే, సినిమా అన్నది వేరు. ఇక్కడ అలాంటి ప్లాన్స్ వర్కౌట్ కావు. ఇలాంటి సినిమాలు చేద్దాం.. ఈ ఏడాది ఇన్ని సినిమాలు చేసేద్దాం.. లాంటి ప్లాన్లు ఇక్కడ అమలుకావు. వచ్చిన వాటిలో మంచివి అనుకున్నవి చేసుకుంటూ పోవడమే!" అని చెప్పింది కాజల్.
*  ఇటీవల అఖిల్ అక్కినేనితో 'హలో' చిత్రాన్ని చేసిన దర్శకుడు విక్రం కుమార్ తన తదుపరి చిత్రాన్ని నాగ చైతన్యతో చేయనున్నాడు. ఈ విషయాన్ని తనే తాజాగా వెల్లడించాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని విక్రం చెప్పాడు.
*  అనుష్క ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న 'భాగమతి' చిత్రం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది విడుదలైన మొదటి మూడు గంటల్లోనే ఒక మిలియన్ (పది లక్షలు) డిజిటల్ వ్యూస్ వచ్చాయి. దీనిని బట్టి చూస్తే ఈ సినిమా పట్ల ఎంతటి క్రేజ్ వుందో అర్థం అవుతుంది. 'పిల్ల జామీందార్' ఫేం అశోక్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
*  ఇటీవల ఆర్టిస్టుగా గ్యాప్ తీసుకున్న హీరో శివాజీ త్వరలో ఓ బాలీవుడ్ సినిమాలో నటించనున్నాడు. అభిషేక్ బచ్చన్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే హీరో హీరోయిన్లుగా రూపొందే సినిమాలో శివాజీ నెగటివ్ టచ్ తో సాగే పాత్ర పోషిస్తాడట.     

More Telugu News