sensex: లాభాల బాట‌లో ప‌రుగులు తీసిన మార్కెట్‌!

  • సెన్సెక్స్ లాభం 199 పాయింట్లు
  • నిఫ్టీ లాభం 65 పాయింట్లు
  • స‌రికొత్త రికార్డు న‌మోదు చేసిన దేశీయ సూచీలు

దేశీయ మార్కెట్లు ఇవాళ లాభాల బాట‌లో న‌డిచాయి. ఉద‌యం నుంచి సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే కొన‌సాగ‌డం విశేషం. ఆసియా మార్కెట్ల సానుకూల ప్ర‌భావం, కంపెనీల త్రైమాసిక ఫ‌లితాలు వెలువ‌డ‌నుండ‌టం క‌లిసొచ్చింది. ప్రారంభం నుంచే 150 పాయింట్ల‌కు పైగా లాభంతో ట్రేడ్ అయిన సెన్సెక్స్ మార్కెట్ ముగిసే స‌మ‌యానికి 199 పాయింట్ల‌కు చేరుకుని 34,353 వ‌ద్ద ముగిసింది. ఒకానొక స‌మ‌యంలో 220 పాయింట్ల వ‌ర‌కు సెన్సెక్స్ ట్రేడ్ అవ‌డం విశేషం.

నిఫ్టీ కూడా 65 పాయింట్లు లాభ‌ప‌డి 10,624 వ‌ద్ద ముగిసి కొత్త‌ రికార్డు సృష్టించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 63.39గా కొనసాగుతోంది. లాభ‌ప‌డిన షేర్ల‌లో కోల్ఇండియా, లుపిన్‌, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్ ఉండ‌గా...  ఎయిర్‌టెల్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటాస్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టపోయాయి.

More Telugu News