akshay kumar: అక్షయ్ కుమార్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన రకుల్

  • తెలుగులో స్టార్ హీరోయిన్ గా రకుల్ 
  • తమిళంలో పెరుగుతోన్న జోరు
  • హిందీలో అవకాశాల పట్ల ఆసక్తి        

తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న రకుల్, తెలుగులో ఆ స్థానాన్ని కాపాడుకుంటూనే తమిళ .. హిందీ భాషల్లో వరుస ఛాన్సులను సొంతం చేసుకుంటోంది. ఇటీవలే తమిళంలో కార్తీతో ఒక సినిమా చేసిన రకుల్, తాజాగా సూర్య సినిమాలోను ఛాన్స్ కొట్టేసింది. సెల్వ రాఘవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా తరువాత మళ్లీ ఆమె కార్తీ జోడీ కడుతుండటం విశేషం. ఇక హిందీలో సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా ఒక సినిమా చేసిన రకుల్, త్వరలో ఆ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈలోగానే ఆమె అక్షయ్ కుమార్ తదుపరి సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నట్టుగా సమాచారం. ఇంతకుముందు అసిన్ .. కాజల్ .. శ్రుతిహాసన్ .. తమన్నాలకు అవకాశం ఇచ్చిన అక్షయ్ కుమార్, తాజాగా రకుల్ కి ఛాన్స్ ఇవ్వడం విశేషం. తమిళ .. హిందీ భాషల్లో దూసుకుపోవడానికి రకుల్ చేసే ప్రయత్నం ఫలిస్తుందేమో చూడాలి. 

More Telugu News